తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్ర‌ధాని మోడీ

‘Successfully completed’.. PM Modi takes sortie on Tejas aircraft in Bengaluru

బెంగుళూరు: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు బెంగుళూరులో తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డెవ‌ల‌ప్ చేసిన తేజ‌స్‌లో ఆయ‌న ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయ‌న విజిట్ చేశారు. ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. తేజ‌స్ త‌యారీ గురించి కూడా ఆయ‌న తెలుసుకున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్న‌ది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ‌తో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్ప‌త్తి చేస్తోంది.