శివాజీ ఫొటోపై తలెత్తిన వివాదం ఫై టీటీడీ క్లారిటీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఏడుకొండలలో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే నిత్యం స్వామి దర్శనానికి వచ్చే భక్తులు భక్తి శ్రద్దలతో… స్వామి సన్నిధిలో గోవింద నామ స్మరణ వినిపిస్తారు. స్వామి వారిని సేవించే తిరుమల చాల సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలలో టీటీడీ చాల జాగ్రత్తలు తీసుకుంటుంది. చిన్న పొరపాటు జరుగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది టీటీడీ. కాగా గత కొద్దీ రోజులుగా తిరుమలలో ఛత్రపతి శివాజీ ఫొటోపై తలెత్తిన వివాదానికి తెరపడింది.

తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మలను అనుమతించడం లేదనేది దుష్ప్రచారమని టీటీడీ కొట్టిపడేసింది. తిరుమల పవిత్రత దృష్ట్యా రాజకీయ, హిందూయేతర సంస్థలకు చెందిన వాటివి మాత్రమే తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇటీవల మహారాష్ట్ర భక్తులకు చెందిన వాహనంపై ఛత్రపతి శివాజీ బొమ్మ తొలగింపుపై కాస్త వివాదం తలెత్తింది. అదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద ప్రతిమలను అనుమతిస్తామని స్పష్టతనిచ్చింది. ఛత్రపతి శివాజీ ప్రతిమను ఈఓ ధర్మారెడ్డికి పాలకమండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్ అందజేశారు.