రాంకీలో ఎలాంటి షేర్లు లేవు :మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

తెదేపా నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని వెల్లడి

Mangalagiri MLA Alla Rama krishna Reddy
Mangalagiri MLA Alla Rama krishna Reddy

Mangalagiri: వైకాపా రాజ్య సభ సభ్యుడు అయోధ్య రామ రెడ్డి కి చెందిన రాంకీ సంస్థల్లో ఇటీవ‌ల ఐటీ తనిఖీలు నిర్వ‌హించిన నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2006లో తాను ఆ సంస్థలో ఉద్యోగం చేశానని , 2006 నుంచి 2021 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఎలాంటి షేర్లు లేవని వెల్లడించారు. టీడీపీ నేతలు తెలుసుకోవాలని అన్నారు. రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఇదిలా ఉండగా , రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/