స్ట్రా బెర్రీ పన్నా రెసిపి

రుచి- కొత్త వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Strawberry Panna Recipe
Strawberry Panna Recipe

జెలటిన్‌తో, మధురమైన క్రీమ్‌తో తయారుచేయబడని ఇటాలియన్‌ డెజర్ట్‌. ఈ క్రీమ్‌ని రమ్‌, కాఫీ, వెనిల్లా లేదా ఇతర ఫ్లేవర్స్‌తో తయారుచేసుకోవచ్చు.

ఇష్టమైన వివిధ రకాల ఫ్లేవర్స్‌తో, సాస్‌లతో దీనిని నింపవచ్చు. స్ట్రాబెర్రీ పన్నా కాటాలో రుచులు అద్భుతంగా ఉంటాయి. ఎరుపు, తెలుపు కాంబో అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు

జెలాటైన్‌ ఆకులు -3 టీ స్పూన్‌లు
డబుల్‌ క్రీం – అరకిలో
పాలు – రెండు పెద్ద కప్పులు
వైట్‌ కాస్టర్‌ షుగర్‌ – 1 పెద్ద కప్పు
వెనిల్లా పాడ్‌ – 1
స్ట్రాబెర్రీలకు
స్ట్రాబెర్రీలు – అరకిలో
హల్డ్‌ సగం, లేదా క్వార్టర్‌ పెద్దదయితే.
కార్నోర్‌ – అర టీ స్పూన్‌
వైట్‌ క్యాస్టర్‌ చక్కెర – 1 కప్పు

తయారు చేయు విధానం

పన్నా కాటా కోసం జెలటిన్‌ ఒక చిన్న గిన్నెలో తీసుకుని అయిదు నిమిషాలు నానబెట్టాలి. ఒక పాన్‌ తీసుకుని క్రీమ్‌, పాలు, చక్కర వెయాలి. వెనిల్లా పాడ్‌ని ఒలిచి దానిలోని గింజలు తీసేయాలి. పైన పాన్‌లో తీసుకున్న క్రీంతో వెనిల్లా పాడ్‌ని కలపాలి. వేడి అయేంతవరకు ఉంచాలి. కానీ ఉడికించకూడదు.

ఇప్పుడు ముందుగా నానబెట్టిన నీటి నుండి జెలటిన్‌ ఆకులను తీసేవేయాలి. ఆకులలో నీటిని పూర్తిగా తొలగించి ఒకేసారి హాట్‌ క్రీంతో కలపాలి. పూర్తిగా కరిగిపోయే వరకు తిప్పుతూ, అరగంట పాటు అలాగే ఉంచాలి. చల్లబడిన తరువాత ద్రవంలో నుండి వెనిల్లా ప్యాడ్లు తీసివేయాలి.

ఈ మిశ్రమాన్ని ఆరు గ్లాసుల్లో పోసి దీనికి కనీసం మూడు గంటల పాటు చల్లార్చాలి

ఒక సాప్‌ పాన్‌ తీసుకుని మొక్కజొన్న పిండి, చక్కెర, స్ట్రాబెర్రీలతో కలపాలి. మీడియం మంటపై అయిదు నిమిషాలు ఉడికించి స్ట్రాబెర్రీలను సాప్టుగా అయేంతవరకు, వాటి నుంచి చిక్కటి రసం వచ్చే వరకు ఉడికించాలి.

ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

పూర్తిగా చల్లబడిన తరువాత స్ట్రాబెర్రీ మిశ్రమంతో కూడిన సెట్‌ పన్నాని పైన నింపాలి. చక్కగా అమర్చి సర్వ్‌ చేయాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/