దళిత ఆత్మగౌరవ పతాక భాగ్యరెడ్డి వర్మ
నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి

మానవ సమూహాలమధ్య ఆదిపత్య భావజాలం సృష్టిస్తున్న ఆరాచకం ఈనాటిది కాదు. ఆదిమజాతుల నుండి ఆధునిక సమాజాల దాకా ఆదిపత్యమానవ సమూహాలు బలహీనులపైన కొనసాగస్తున్న ఆకృత్యాలు ఈ భూమ్మీద ఏదో ఒక మూలన నేటికీ మనం చూస్తూనే ఉన్నాం.
మనదేశంలో వైదిక ధర్మం సృష్టించిన నిచ్చెనమెట్లలాంటి కులవ్యవస్థ, అభాగ్యులపైన, నిస్సహాయులపైన, అనాగారిన వర్గాలపైన ఒక్కమాటలో చెప్పాలంటే సనాతన వైధికవాధులు ీపంచములుగా ముద్రవేసిన దళఙత జాతులపైన అగ్రకుల అహంకారులు అమానవీయ ఆకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
వైదిక సనాతనవాదులు శాస్త్రం పేరుతో, కులంపేరుతో సృష్టించిన దాష్టికాలను ప్రశ్నిస్తూ గళమెత్తిన ధిక్కారస్వరమే డక్కన్ తొలితరం దళితోద్యమ నాయకుడు భాగ్యరెడ్డివర్మ. 1888 మే, 22న హైదరాబాద్‌లో దళిత ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది. ‘మాదిర వెంకయ్య రంగమాంబ దంపతులకు భాగయ్య జన్మించాడు.
అంటరాని కులంలో పుట్టినందుకు చిన్నతనంలోనే సమాజపు వివక్షను చూసాడు. ఆర్యులు రాకముందు దళితులే ఈ దేశ మూలవాసులు అని చెప్పిన గురువ్ఞమాటలు భాగయ్య మనస్సులో బలంగా నాటుకున్నాయి.
గురువు వాస్తవిక దృష్టిలో మూలవాసులే ఈ దేశపాలకులు అని బలంగా విశ్వసించారు గనకనే భాగయ్య పేరుకు ీరేడును చేర్చాడు
‘రేడు అనగా పాలకుడు అని అర్ధం ఆ పేరు క్రమంగా భాగ్యరెడ్డిగా స్థిరపడింది. 1900 సంవత్సరం నాటికే భారతదేశంలో అనేక సంఘసంస్కరణ ఉద్యమాలు నడుస్తున్నాయి.
సామాజిక న్యాయం కోసం నినదించిన మహాత్మ జ్యోతిరావ్‌పూలే వారసత్వాన్ని అందుకున్న భాగ్యరెడ్డి అంబేద్కర్ కన్న ముందే దళితుల కోసం గొంతెత్తారు.
మేం పంచములం కాదు ఈ దేశ మూలవాసులం ఆది-హిందువ్ఞలమంటూ ఉద్యమానికి నాంది పలికారు. ఆది హిందూమహాసభను స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
స్వామి అత్యుతానందతోపాటు కలిసి ఆదిహిందూ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోగలిగాడు భాగ్యరెడ్డివర్మ. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపడానికి 1906లో ‘జెగన్ మిత్రమండలి స్థాపించి హరిదాసులు, మాలజంగాల చేత హరికథ చెప్పించేవారు.
ఆ కార్యక్రమం ప్రారంభ, ముగింపు సమయాల్లో భాగ్యరెడ్డి దళితులనుద్దేశించి ప్రసంగించేవారు. పేదరికం అవిద్యా, తరాలుగా దళితులను అజ్ఞానపు అంధకారాన్ని పారదోలేందుకు దళితుల కోసం హైదరాబాదులోని ‘ఇసామియా బజార్‌లో పాఠశాలలకు విస్తరించారు.
1911లో ‘ఆదిహిందూ సోషల్ సర్వీస్‌లీగ్ ను స్థాపించిన భాగ్యరెడ్డి ఆదిహిందువ్ఞల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ దశలో ఆర్యసమాజ్ చేపట్టిన స్త్రీవిద్య, బాల్యవివాహాల నిర్మూలన, అంటరానితనం నిర్మూలన వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భాగ్యరెడ్డి సామాజిక సేవను గుర్తిస్తూ ఆర్యసమాజ్ 1913లో తనను వర్మ అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1917లో విజయవాడలో జరిగిన ‘అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి వర్మ చేసిన ప్రసంగం గాంధీని ఆకట్టుకుంది.
ఆ తర్వాత హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇసామియా బజార్‌లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన తెలుగుమీడియం పాఠశాలలను సందర్శించిన గాంధీ, తెలుగుతోపాటు హిందీని కూడా పాఠ్యాంశంగా పెట్టాలని సూచించారు.
ఉత్తర భారతంలో అంబేడ్కర్ చేసిన ప్రతి ఉద్యమానికి హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ చేసిన దళిత ఉద్యమమే మూలమైంది.
కాగా దేశవ్యాప్తంగా సాగిన ఆదిజన మూలవాసి ఉద్యమాలకు మన భాగ్యరెడ్డివర్మ చూపించిన దారే మార్గమైంది. దళిత ఉపకులాల న్వయంకొరకు
1919లో ీ’ఆదిహిందూ సమ్మేళనాన్ని ప్రారంభించి, దళితుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ‘మొహల్లా పంచాయితీలను నెలకొల్పారు.
దళిత చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తు ప్రదర్శన నిర్వహించారు
.1931లో లక్నోలో జరిగిన నిమ్నవర్గాల జాతీయ సదస్సులో యావత్ దేశదళిత వర్గాల భవిష్యత్తును మలుపుతిప్పే కీలకమైన ప్రతిపాదన చేసారు.
దేశంలోని 7కోట్లమంది దళితుల సమస్యలు బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి లండన్‌లో జరిగే రెండవ రౌండ్‌టేబుల్ సమావేశానికి అంబేద్కర్‌ని ప్రతినిధిగా పంపాలని ప్రతిపాదించి ఆ తీర్మాణాన్ని ఆమోదింపచేశారు.
పంచములు, అవర్ణులు, మాలా, మాదివంటి పేర్లతో కాకుండా వారిని ఆది హిందువ్ఞలుగా పిలవాలని భాగ్యరెడ్డి చేసిన డిమాండ్‌ను నిజాం ప్రభుత్వం అంగీకరించింది.
1931లో చేపట్టిన జనగణనలో దళితులను ఆదిహిందువ్ఞలగా నమోదు చేసింది. దళితుల విద్యావ్యాప్తికి, జోగిని వ్యవస్థ నిర్మూలనకి వ్యసనాలు లేని సమాజం కోసం భాగ్యరెడ్డి చేసిన కృషి వారిలో మార్పును తీసుకురాగల్గింది.
1927 నుండి 1931 వరకు జాతీయ దళిత మహాసభలకు అధ్యక్షత వహించి వేరువేరు సందర్భాల్లో గాంధీలాంటి నాయకులతో జాతీయ సదస్సుల వేదికలు పంచుకున్నారు
భాగ్యరెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఆదిహిందూ ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో భాగ్యరెడ్డి వర్మ పడ్డ శ్రమ నేటికి అనిర్వచనీయం.
ఉత్తరదక్షిణ భారతదేశాన్ని ఐక్యం చేస్తూ దళితజాతి చైతన్యానికి కేంద్రబిందువై నిలిచారు భాగ్యరెడ్డివర్మ. అంతటి మహానీయునికి గుర్తించదగ్గ స్మృతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించకపోవడం విచారకరం.
ఈ గడ్డపై పుట్టిన మహానీయు లను గౌరవించుకోవడమంటే మనలను మనం గౌరవించు కోవడం. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి.
-కల్లోజి సుశీల్‌కుమార్
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/