మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోయి 53,514కు పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 15,966 వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/