భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః నిన్న భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. ఈరోజు ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ… చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 690 పాయింట్లు లాభపడి 71,060కి ఎగబాకింది. నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 21,454కు చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.12 వద్ద కొనసాగుతుంది.