నష్టాలో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు పతనమవుతూనే వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,062 పాయింట్లు కోల్పోయి 72,404కి దిగజారింది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 22,068కి పడిపోయింది.