జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్న చంద్రబాబు
జంగారెడ్డిగూడెంలో నాటు సారా కలకలం
మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా కలకలం.. వరుస మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో నేడు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు, పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను వైస్సార్సీపీ నాయకులు ఏలూరుకు తరలించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జీలిగుమిల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు. జంగారెడ్డి గూడెం రాకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/