ఐటీ విచారణకు హాజరైన మల్లారెడ్డి కాలేజీల సిబ్బంది

ఐటీ రైడ్స్ కేసులో సోమవారం మంత్రి మల్లారెడ్డి తో పాటు 12 మందిని ఐటీశాఖ అధికారులు విచారించిన సంగతి తెలిసందే. ఈరోజు మల్లారెడ్డి కాలేజీల సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల సిబ్బంది ఒక్కొక్కరుగా బషీర్బాగ్లోని ఇన్ కం ట్యాక్స్ ఆఫీసుకు హాజరవుతున్నారు.

నోటీస్ కాపీలను తీసుకొని ఇప్పటి వరకు 9 మంది ఐటీ కార్యాలయానికి వచ్చారు. వారిలో మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య, ఉద్యోగి జె.రవికాంత్, ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ వీఏ నారాయణ, బీవీ అశోక్, మెడకల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డా. వాకా మురళీ మోహన్, డా. కేఎస్ రావు, అకౌంట్స్ ఆఫీసర్లైన వి. శ్రీనివాస్, బి. రాజేశ్వర్ రెడ్డితో పాటు మరో అకౌంటెంట్ ను అధికారులు విచారించనున్నారు.

నిన్న విచారణ అనంతరం మల్లా రెడ్డి కుమారుడు మీడియాతో మాట్లాడారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు ఇచ్చామన్నారు. తనతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని అధికారులు విచారించారని చెప్పారు. తమతో పాటు తమ కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారని చెప్పారు.

అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలను సమర్పించాలని అధికారులు కోరారని వెల్లడించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలని కోరారన్నారు. అధికారులు అడిగిన ఫార్మట్‌లోనే పూర్తి వివరాలు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. తాము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారని అనుకుంటున్నట్టు వివరించారు. ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు రాలేదన్నారు. ఐటీ అధికారుల విచారణకు తాము అన్ని విధాల సహకరిస్తామన్నారు.