రాజమౌళి చేతుల మీదుగా హీరో ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా పరిచయమ‌వుతున్న చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్‌. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా.. రియాలిటీలోకి రా..’ అని నరేశ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా హీరో కావాలని కలలు కనే నేటి తరం కుర్రాడి పాత్రలో అశోక్ కనిపిస్తున్నాడు. దీనికి అతని తల్లి సైడ్ నుంచి సపోర్ట్ లభిస్తుండగా.. తండ్రి (నరేష్) మరియు ప్రేయసి ఫాదర్ (జగపతి బాబు) మాత్రం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘హీరో’ సినిమాలో అశోక్ డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. అందులో కౌబాయ్ మరియు జోకర్ గెటప్స్ రెండూ ప్రత్యేకంగా నిలుస్తాయని తెలుస్తోంది. ట్రైలర్ లో అశోక్ ఎనర్జిటిక్ గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటుగా కామెడీ మరియు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ను ట్రైలర్ లో చూపించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె గల్లా అశోక్ కు లిప్ లాక్ ఇవ్వడం విశేషం. ఇక తండ్రి దగ్గర నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పే విధానం ఆ తరువాత అతనే జగపతి బాబు అని అర్థమవుతుంది. చూస్తుంటే ఈ సినిమా మామ అల్లుళ్ల మధ్య కొనసాగే ఒక డిఫరెంట్ యాక్షన్ ఫిలింగా రాబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు నెగిటివ్ పాత్రలో డిఫరెంట్గా కనిపించబోతున్నారు. ఇక వెన్నెల కిషోర్, సత్య వంటి ప్రముఖ కమెడియన్స్ కూడా ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ పాత్రలు చేసినట్లు అనిపిస్తుంది

కుమారుడి లాంచింగ్ కోసం ఏపీ గల్లా జయదేవ్ ఖర్చుకు వెనకాడకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ”హీరో” సినిమాని రూపొందించారని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. మరి సినిమా ఇలా ఉందనేది మరో ఐదు రోజుల్లో తెలుస్తుంది.

YouTube video