బుల్లితెర రాములమ్మ మరోసారి దుమ్ములేపింది

ధమాకా లోని దండకాడియాల్ సాంగ్ యూత్ ను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. రవితేజ – శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యముగా ఈ మూవీ లోని సాంగ్స్ సూపర్ హిట్ సాధించడం తో సినిమా విజయంలో భాగం అయ్యాయి. సినిమాలోని జింతాక్..జింతాక్ , దండకాడియాల్ సాంగ్స్ బాగా అలరించాయి. వీటికి రీల్స్ కూడా వందల మంది సినీ లవర్స్ తో పాటు సినీ ప్రముఖులు చేయడం జరిగింది. తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తనదైన స్టయిల్ లో చించేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.

ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసి తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇక సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంటుంది.

తాజాగా దండ కడియాల్ అనే మాస్ పాటకు శ్రీముఖి .. బీబీ జోడి డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేసింది. బీబీ జోడిలో కృష్ణ మాస్టర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాడు. ఆయనతో కలిసి లేటేస్ట్ చార్ట్ బస్టర్‌ సాంగ్‌కు శ్రీముఖి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ ఇద్దరి స్టెప్పులు జనాలను ఆకట్టుకుంటున్నాయి. మాస్ సాంగ్‌కు శ్రీముఖి స్టెప్పులు వేస్తే వేరే లెవెల్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక దండ కడియాల్ అంటూ ఊపేసిన శ్రీముఖి రీల్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ రోల్‌ను చేస్తోంది.

https://www.instagram.com/reel/CnmP2x8P3_n/?utm_source=ig_web_copy_link