శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక చింతన

Srimadramayanam
Srimadramayanam

విజ్ఞానశాస్త్రం-మతం పరస్పర విరుద్ధమైనవని భావించి కొందరు. ‘ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ సాముద్రికం, జ్యోతిష్యం, వాస్తు, శకునాలు ఇలాంటి వాటిని నమ్మవచ్చా? అని ప్రశ్నిస్తుంటారు.

కొందరేమో రామాయణ, భారత, భాగవతాది పవిత్రగ్రంధాలలోనే అవి ఉన్నాయి కదా అని అంటారు.

అఇయతే ఆయాగ్రంథాలను నిష్పక్షపాతంగా, సునిశీతంగా పరిశీలిస్తే ఆ గ్రంథాలే వాటిని గూర్చి ఏమని బోధిస్తాయో అర్థమవ్ఞతుంది. ప్రస్తుతం వాల్మీకి రామాయణాన్ని పరిశీలిద్దాం.

శ్రీమద్రామాయణంలో వచనకావ్యం- చిలుకూరు వెంకటేశ్వర్లు రామకృష్ణమఠం, హైదరాబాదు. ‘శ్రీరాముడు సర్వశాస్త్ర పారంగతుడు.

అతని బాహువ్ఞలు మిక్కిలి బలిష్టమై మోకాళ్లదాకా ఉంటాయి. అందువల్ల ఆజానుబాహువని అతణ్ణి కీర్తిస్తారు.

కంఠం శంఖంవలె ఉంటుంది. ఉన్నతమైన చెక్కిళ్లు గలవాడు. జీవితమంతా సుఖాలను భావిస్తారని సాముద్రిక శాస్త్రజ్ఞులు అంటారు. (పుట-2-శ్రీమద్రాయాణం)

నిజానికి శ్రీరాముడు మొదటినుంచీ చివరవరకు ఎన్నో కష్టాలుపడ్డాడని అదే రామాయణం చెబుతుంది.

మరి రామాయణ బోధసాముద్రికశాస్త్రాన్ని నమ్మమనా, వద్దనా? ‘యజ్ఞం పూర్తియై సుమారు ఒక సంవత్సరం అయింది.

చైత్రమాసంలో పునర్వసునక్షత్ర యుక్త నవమినాడు, ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా లోకోద్ధారకుడు, ఇక్ష్వాకు వంశోద్ధారకుడు అయిన శ్రీరామచంద్రుడు శ్రీమహావిష్ణువ్ఞ పూర్ణావతారంగా అవతరించాడు (పుట 27).

అంత శుభసమయంలో జన్మించిన శ్రీరాముని జీవితం సాఫీగా సాగిందా? ‘లక్ష్మీప్రదమైన పుష్యమీ నక్షత్రమందు మీ పట్టాభిషేకం జరుగుతుందని, బ్రాహ్మణులు, పండితులు నిర్ణయించారు కదా!

అని సీతాదేవి చెబితే ‘ఓ సీతా! పూజ్యుడైన నా తండ్రి దశరథమహారాజు నన్ను అరణ్యవాసం చెయ్యమని ఆజ్ఞాపించాడు అని శ్రీరాముడు చెప్పాడు (పుట 143)

అడవ్ఞలకు వెళ్లిన శ్రీరాముడిని మళ్ల వెనుక్కు రాజ్యానికి తీసుకొని రావలెనన్న తలంపుతో భరతుడు, ‘జ్యోతిశ్శాస్త్రవేత్తలు ముహూర్తంబలం చూసుకొని నిర్దేశించిన శుభముహూర్తంలో బయలుదేరాడు (పుట 229)

అయినా ఏ పనిమీద ఆయన బయలుదేరాడో ఆ పని మాత్రం నెరవేరలేదు.

రాముడు అయోధ్యకు తిరిగి రాటానికి అంగీకరించలేదు. ఈ సంఘటనల ద్వారా రామాయణం మనల్ని జ్యోతిష్యాన్ని నమ్మమంటుందా, వద్దంటుందా? ఇక వాస్తును గురించి చూద్దాం (లక్ష్మణా!

మనం ఈ పర్ణశాలలోనే చాలా కాలం ఉండాలని అనుకొంటున్నాను. అందువల్ల వాస్తుశాంతి కూడా చేస్తే బాగుంటుంది. కనుక లేడి మాంసం తీసుకొనిరా. నైవేద్యం చేసి వాస్తు పూజ చేద్దాం.

ఈరోజు మంచి ముహూర్తం. యజమానికి స్థిరత్వాన్నిస్తుంది అని చెప్పాడు శ్రీరాముడు చిత్రకూటపర్వతంపైన పర్ణశాలను ఏర్పరుచుకొన్నప్పుడు. లక్ష్మణుడు అట్లే చేశాడు.

(పుటలు 191-192) కానీ వారు అక్కడ ఉండటం వల్ల అక్కడి బుషులంతా చిత్రకూటాన్ని వదివెళుతున్నారని కులపతి ద్వారా తెలుసుకొని వారూ అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు.

(పుటలు 280-281) మరి రామాయణం వాస్తును నమ్మమంటుందా, వద్దంటుందా?

‘సీతారాముల కల్యాణం తర్వాత దశరధుడు రామలక్షగిణులతో కలిసి ప్రయాణం చేస్తుండగా పక్షులు భయంకరమైన వికృత ధ్వనులు చేశాయి. జంతువ్ఞలన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి.

దశరధుడు ఇవన్నీ దుశ్శకునాలని ఏదో కీడు శంకిస్తున్నదని వసిష్ఠునితో అన్నాడు (పుట 89-92) పరుశురాముడు వచ్చాడు, శ్రీరాముని సాక్షాత్తు విష్ణువ్ఞగనే అంగీకరించి వెళ్లిపోయాడు.

శ్రీరాముని దివ్యత్వం బయటపడిందిగానీ ఎవరికీ ఏ కీడు కల్గలేదు. మరి శకునాలను నమ్మమంటుందా, వద్దంటుందా రామాయణం? ఏ మతగ్రంథమైనా ఆత్మశక్తిని నమ్మమంటుంది.

ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోమని బోధిస్తుంది.

ఆత్మవిశ్వాసం, పరమాత్ముని పట్ల భక్తి ఉన్నవాడు జ్యోతిష్యం, వాస్తు, సాముద్రికం, శకునాలు వీటి జోలికిపోడు,పోరాదు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/