వైస్సార్సీపీ నేత దారుణ హత్య

శ్రీకాకుళం జిల్లాలో వైస్సార్సీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు.. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్ కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. రక్తపు మడుగులో రామశేషుని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామశేషు హార్డ్వేర్, సిమెంట్, ఎరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రామశేషుపై ఆరేళ్ళ క్రితం హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్ర గాయాలు కాగా కోలుకున్నారు. అప్పుడు ప్రాణాలతో రామ శేషు బయటపడ్డారు. ఇప్పుడు దారుణ హత్యకు గురయ్యారు.

రామశేషు గతంలో గ్రామంలో మూడుసార్లు సర్పంచ్‌గా పనిచేసారు. అయితే మంగళవారం ఉదయం తన గోడౌన్‌కు స్టాక్‌ వచ్చిందని ఫోన్‌ రావడంతో రామశేషు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు మీద కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండిరాయితో కొట్టడంతో రక్తపు మడుగులో అక్కడికక్కమే మృతిచెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.