‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ ..’మందులోడా మాస్ కా బాస్’ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి చే సాంగ్ విడుదల

Mega Star Chiranjeevi- Hero Sudheer babu -others
Mega Star Chiranjeevi- Hero Sudheer babu -others

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు.

క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి, ఆ త‌రువాత విడుద‌లైన గ్లిమ్స్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాట‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు.

ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వ‌డంలో మ‌ణిశ‌ర్మ‌ది ఓ ప్ర‌త్యేక‌మైన శైలి, అందుకు త‌గ్గ‌ట్లుగానే ప్ర‌ముఖ లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్  మందులోడా అంటూ సాగే మాస్ తీన్ మార్ లిరిక్స్ అందించారు దీంతో ఇప్పుడు ఈ పాట‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాట లిరిక‌ల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది.

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుద‌లైంది.

‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/