లైగర్ ఫై శ్రీ రెడ్డి కామెంట్స్..అవసరమా అంటూ ఓ రేంజ్ లో వేసుకుంది

ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్ గురించే మాట్లాడుకుంటున్నారు .పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాక్సింగ్ నేపథ్యంలో కథ..మైక్ టైసన్ నటించడం..పాన్ ఇండియా గా విడుదల కావడం తో అభిమానులు ఎన్నో ఆశలతో థియేటర్స్ కు వెళ్లారు. కానీ థియేటర్స్ కు వెళ్లిన అభిమానుల ఆశలపై పూరి నీళ్లు చల్లాడు.

అసలు ఇది పూరి..విజయ్ తో చేయాల్సిన సినిమానేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఉదయం ఆట నుండే సినిమాకు నెగిటివ్ టాక్ రాగా..సోషల్ మీడియా లోను అదే టాక్ వైరల్ గా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పూరి ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో క్యాస్టింగ్​కౌచ్ అంటూ ఒక్కసారిగా వైరల్ గా మారిన శ్రీ రెడ్డి సైతం లైగర్ ఫై విమర్శల వర్షం కురిపించింది.

‘లైగర్​కు ముందు లైగర్​కు తర్వాత అంట.. అనవసరమైన హైప్​లు అవసరమా?, కంటెంట్​ఉన్నోడికి హైప్​అవసరం లేదు. లైగర్​కన్నా కార్తికేయ 2 బెటర్​. బెటర్​కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం’ అని ట్వీటర్​ద్వారా శ్రీరెడ్డి షాకింగ్​ కామెంట్స్​ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.

ఇక లైగర్​మూవీని ప్రముఖ బాలీవుడ్​సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు.