స్కర్ట్ లో కాకా రేపుతున్న పూనమ్ బజ్వా

స్కర్ట్ లో పూనమ్ బజ్వా కాకరేపుతుంది. 2005లో వచ్చిన ‘మొదటి సినిమా’ ద్వారా పూనమ్ బజ్వా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ మూవీలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రని పోషించి నటనతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, నాగార్జున సరసన ‘బాస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమాలు అంత విజయవంతం కాకపోవడంతో తర్వాత ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది.

ఈ క్రమంలో చేసిన ‘పరుగు’ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కానీ అక్కడా సక్సెస్ కాలేకపోయింది. ‘ఓం’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డిని.. పూనమ్ రహాస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. దాని పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా.. ఈమె తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వేడి పుట్టిస్తుంది. తాజాగా స్కర్ట్ లో హాట్ హాట్ గా కనిపించి నెటిజన్ల ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.