జనసేన కార్యకర్తను చెంపదెబ్బ కొట్టిన మహిళా సీఐ

శ్రీకాళహస్తిలో జగన్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన జనసైనికులు

sri-kalahasti-ci-anju-yadav-slaps-janasena-leader

శ్రీకాళహస్తిః తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసైనికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం దిష్టిబొమ్మ దహనానికి వారు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ అంజు యాదవ్ వారికి చెప్పారు. అయినప్పటికీ వారు దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో ఒక నేత చెంపలపై ఆమె కొట్టారు. ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మహిళా సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.