బోర్డులో తప్పులు చేస్తే కఠిన చర్యలు

ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హెచ్చరిక

CS Somesh kumar
CS Somesh kumar

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరీక్షలు పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారని సిఎస్‌ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దామన్నారు. ఈ సారి తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. చిన్న తప్పు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. పరీక్షల్లో ఇంటర్ విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టం (బిఐజిఆర్‌ఎస్‌ ) యాప్‌ను సిఎస్‌ ప్రారంభించారు. బిఐజిఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా విద్యార్థులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కూడా ఒకటని అన్నారు. విద్యార్థులు ఇకపై ఒక్కరోజులోనే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బోర్డులో తప్పులు చేసే అధికారులు, సిబ్బందికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/