చెక్‌ డ్యాంను ప్రారంభించిన స్పీకర్‌, మంత్రి

కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ.15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.శరత్, మండలాధ్యక్షురాలు దొడ్ల నీరజ, జెట్పీటీసీ పద్మ, బాన్సువాడ పురపాలక సంఘ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/