ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బిజెపి ఇంచార్జీల నియామకం

పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ పరంగా ఇంచార్జీలతోపాటు కో ఇంచార్జీలను నియమిస్తూ ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను అసోం రాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా, డాక్టర్ జితేంద్ర సింగ్‌ను అసోం కో ఇంచార్జిగా నియమించారు. అలాగే, కేంద్ర హోం శాఖ సహాలయ మంత్రి జీ కిషన్‌రెరెడ్డికి తమిళనాడు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌ను తమిళనాడు కో ఇంచార్జిగా చేశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇంచార్జి అరుణ్ సింగ్ సంతకంతో జారీ చేసిన ఈ జాబితా ప్రకారం, కేరళ ఎన్నికల బాధ్యతను ప్రహ్లాద్ జోషికి, కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్‌కు కో ఇంచార్జి బాధ్యతను అప్పగించారు. పుదుచ్చేరి ఎన్నికల ఇంచార్జిగా అర్జున్ రామ్ మేఘవాల్‌ను, జాతీయ ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్‌ను కో ఇంచార్జిగా నియమించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/