మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఆడియో లీక్..

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమెకు నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఈమె ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కారకుడైన సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటె ప్రీతీ కి సంబదించిన ఓ ఆడియో ఆదివారం బయటకు వచ్చింది. ఈ ఆడియో వింటే సైఫ్ ..ప్రీతీ ని ఏ రకంగా భయపెట్టాడో..వేదించాడో అర్ధమవుతుంది. సైఫ్ తీరు పట్ల ప్రీతీ తన తల్లికి చెపుతూ బాధపడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆడియో లో ఏమాట్లాడిందంటే.. ‘ఇప్పటికే సైఫ్‌పై నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ పిలిచి నన్ను అడిగాడు. చదువుకోవాలంటే భయమేస్తోంది అమ్మ’ అని ప్రీతి చెప్పగా.. చదవుపై దృష్టి పెట్టాలని, సైఫ్ ఏం చేయలేడని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పినట్లు ఈ ఆడియోలో ఉంది. ప్రీతిని సైఫ్ ఎంతలా వేధించాడో ఈ ఆడియోను బట్టి తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రీతి నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సహాయంతో ఐదుగురు డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. ప్రీతిని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోన్నారు. ఆమెకు అత్యాధునిక చికత్స అందిస్తోన్నారు. ప్రీతి కోలుకోవాలని అందరూ ప్రార్ధనలు చేస్తోన్నారు.