హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి

విజ్ఞప్తి చేస్తున్న రైతులు

former
former

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి అవసరమైన కార్పెట్లు సరాఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఎక్కువగా ఉందని , తడిసిన ధాన్యమని అధికారులు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. అదీకాక 40కేజీల ధాన్యం బస్తాకు రూ.12.50 హమాలి వసూలు చేస్తున్నారని , ఈ కష్ట కాలంలో ప్రభుత్వమే హమాలీ ఖర్చులను భరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని అంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/