అస్సాం పర్యటనకు స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లు అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో జరుగుతున్న 8వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. ఈరోజు, రేపు (ఏప్రిల్ 11, 12) జరగనున్న CPA కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం నుండి అసెంబ్లీ స్పీకర్ పోచారం, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఉదయం సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి గౌహతి బయలుదేరి వెళ్లారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/