అమెరికాను తాకిన కరోనా వైరస్‌

తొలి కేసును గుర్తించిన అధికారులు

Wuhan coronavirus confirmed by CDC
Wuhan coronavirus confirmed by CDC

వాషింగ్టన్‌: చైనాలోని వుహాన్‌ నగరంలో గత నెలలో వెలుగు చూసిన న్యూమోనియా తరహా వ్యాధికారక కరోనా వైరస్‌ ఇప్పుడు అమెరికా తీరాన్ని తాకింది. ఈ వైరస్‌ ఇప్పటికే అయిదుదేశాల్లో 300 మందికి సోకింది. 17 మంది ప్రాణాలను కబళించింది. ఇప్పుడీ వైరస్‌ పాకిన ఆరవ దేశం అమెరికా. చైనా పొరుగుదేశాలయిన రష్యా, భారత్‌ ముందస్తు జాగ్రత్త చర్యగా వైరస్‌ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశాయి. వాషింగ్టన్‌లోని స్నోహోమిష్‌ కౌంటీలో ఈ వైరస్‌కు సంబంధించిన మొదటి కేసును గుర్తించారు. గత వారం వుహాన్‌ నగరం నుండి అమెరికాకు తిరిగి వచ్చిన వ్యక్తి ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం నాటికి చైనాలోని బీజింగ్‌ షెన్‌జెన్‌, షాంఘై తదితర నగరాలలో 40 కేసులు అధికారికంగా నమోదు కాగా, థారులాండ్‌, ద.కొరియా, జపాన్‌, తైవాన్‌లలో కూడా ఈ వైరస్‌ వెలుగు చూసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/