ప్రతి రూపాయి కూడా నిరుపేదల కోసమే అంటున్న సోనూసూద్

it-raids-on-sonu-sood-properties

రియల్ హీరో సోనూసూద్ కు సంబదించిన ఆఫీస్ లపై మూడు రోజులుగా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని సోను నివాసంతోపాటు.. నాగ్‌పూర్‌, జైపుర్‌లలో ఉన్న ఆఫీస్ లపై ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు ఐటీ అధికారులు. సోదాలు అనంతరం ఐటీ అధికారులు సోనూసూద్.. ​ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్​ ఎగ్గొట్టాడని వెల్లడించారు. ఈ వార్త తెలిసి అంత షాక్ అయ్యారు.

గత నాల్గు రోజులుగా సోషల్ మీడియా లో ఈ రైడ్స్ గురించే అంత మాట్లాడాడుకున్నారు. తాజాగా సోనూసూద్ త‌న‌పై జ‌రిగిన దాడుల‌కు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసం పోగు చేసిందే. మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను ఐటీ అధికారులతో బిజీగా ఉన్నాను. ఆ కార‌ణం వ‌ల్ల‌నే మీ సేవ‌లోఉండ‌లేక‌పోయాను. ఇప్పుడు తిరిగి వ‌చ్చాను అంటూ త‌న ట్వీట్‌లో సోనూసూద్‌ స్పందించారు.

“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021