ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు

కేవలం మామూలు పరీక్షలే – ఆసుపత్రి చైర్మన్‌ వెల్లడి

sonia gandhi
sonia gandhi

New Delhi: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం రాత్రి ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆమె అడ్మిట్‌ అయ్యారని గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

రాత్రి 7 గంటల సమయంలో సోనియా ఆసుపత్రికి వచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా వెల్లడించారు.

అంతకు ముందు ఆమె దేశంలో కరోనా పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ రాజ్యసభ ఎంపీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సోనియా ఆరోగ్యంగానే ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ చెక్‌అప్‌ కోసమే ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్‌ ముఖ్యులు వివరణ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/