ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలఫై జీవీఎల్ విమర్శలు

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు లో ఏపీ రాజధాని విశాఖనే అని , త్వరలో విశాఖ రాజధాని కాబోతోందని.. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను అన్నారు. త్వరలోనే విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ఉంటాయన్నారు. ఏపీ మూడు రాజధానులపై సుప్రీం కోర్టు లో విచారణలో ఉన్న సమయంలోనే జగన్ ఇలా కామెంట్స్ చేయడం తో న్యాయనిపుణులు తప్పుపడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

సుప్రీంకోర్టును అవమానించేలా జగన్ వ్యాఖ్యలు చేశారని , జగన్ రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని జీవీఎల్ అన్నారు. సమష్టి నిర్ణయంతో అమరావతిని రాజధానిగా తీర్మానించారని వెల్లడించారు. ఐటీ హబ్ గా విశాఖకు అవకాశాలు ఉన్నాయని , విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును స్వాగతిస్తున్నామని జీవీఎల్ తెలిపారు.