పన్నీర్‌ మఖానీ

రుచి: వెరైటీ వంటకాలు

Panneer Makhani
Panneer Makhani

కావలసిన పదార్థాలు:

పన్నీర్‌ – 200 గ్రాములు, యాలకులు – నాలుగు, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లిరెబ్బలు – ఎనిమిది, అల్లంతురుము – రెండు టీస్పూన్లు.

పచ్చిమిర్చి – రెండు, టమోటా గుజ్జు – మూడు కప్పులు, కాశ్మీరీకారం – ఒకటిన్నర టీ స్పూన్లు, కొత్తిమీర తురుము – మూడు టేబుల్‌ స్పూన్లు.

గరం మసాలా – టీ స్పూన్‌, కసూరి మెంతి – టీ స్పూన్‌, తేనె- టీ స్పూన్‌, చిక్కనిపాలు – పావుకప్పు, నూనె నాలుగు టేబుల్‌ స్పూన్‌లు

తయారుచేయు విధానం:

పన్నీర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. విడిగా ఓ పాన్‌లో టమోటా గుజ్జు, ఉప్పు వేసి ఉడికించాలి.

మరో పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక, పన్నీర్‌ ముక్కలు వేసి వాటి మీద కొద్ది ఉప్పూ కారం చల్లి వేయిం చాలి.

నాన్‌స్టిక్‌ పాన్‌లో మిగిలిన నూనె వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉడికించిన టమోటా గుజ్జు కూడా వేసి బాగా కలపాలి.

కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, గరం మసాలా, కసూరిమెంతి, తేనె అన్నీ వేసి కలపాలి.

ఇప్పుడు వేయించిన పన్నీర్‌ ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా పాలు పోసి కలిపి వడ్డించాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/