పుట్టినరోజు వేడుకలకు దూరంగా సోనియా గాంధీ

రైతుల ఆందోళన, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకలకు దూరం

sonia gandhi
sonia gandhi

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, రైతు సంఘాల దేశవ్యాప్త బంద్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేటి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రైతుల ఆందోళనకు తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ తన బర్త్ డే వేడుకలను నిర్వహించవద్దని సూచించారు.

క్రూరమైన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. సోనియా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/