ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు..సోనియా

విశ్వాసపాత్రుడైన మంచి స్నేహితుడిని కోల్పోయా.. సోనియాగాంధీ

Sonia Gandhi – Ahmed Patel

న్యూఢిల్లీ: అహ్మద్ పటేల్ మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్ ను తలచుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు నమ్మిన బంటులా ఉంటూ, పార్టీ కష్టాల్లో పడిన వేళ తన చతురతతో సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే వ్యక్తి అహ్మద్ పటేల్. తాను అత్యంత విశ్వాసపాత్రుడైన మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆమె అన్నారు. అహ్మద్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అంకితభావానికి, విశ్వాసానికి మారుపేరైన ఆయన, తనకు అప్పగించిన ఏ కర్తవ్యాన్ని అయినా నిబద్ధతతో నెరవేర్చేవారని, ఇతరులకు సాయపడటంలో అందరికన్నా ముందుంటారని సోనియా వ్యాఖ్యానించారు. అహ్మద్ కు ఉన్న దయాగుణమే ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపిందని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/