ఢిల్లీలో కాలుష్యం..సోనియాకు వైద్య నిపుణుల సలహా

ఉబ్బసం, ఛాతీ నొప్పి పెరిగే అవకాశం

sonia gandhi
sonia gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కొంతకాలంగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిపోయింది. దీంతో స్థానికులు శ్వాసకోశ, గొంతు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా సైతం కొద్ది రోజుల పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్లతారని, కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వెళ్లనున్నారని సమాచారం.

కాగా, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా జూలై 30న ఆమె గంగారాం హాస్పిటల్ లో చికిత్సను కూడా పొందారు. ఆపై సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించుకుని వచ్చారు. ఇక ఢిల్లీలో పెరిగిన కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉబ్బసం సోకే అవకాశాలు అధికమని, ఆపై ఛాతీ నొప్పి తీవ్రతరం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/