మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

అమరావతి : టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం దేవినేని ఉమ వెళ్లగా జి.కొండూరు ప్రాంతంలో ఉద్రిక్త‌తలు చెల‌రేగాయ‌ని చెబుతూ పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. హైకోర్టును ఆశ్రయించ‌డంతో బెయిల్ వ‌చ్చింది.

కాగా, దేవినేని ఉమపై ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్‌ ఏ నేరానికీ పాల్పడలేదన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన‌లు కూడా విన్న కోర్టు చివ‌ర‌కు దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/