వైరస్ ఇంతపని చేస్తుందని అనుకోలేదు

సోనాక్షి సిన్హా స్పందన

Actress Sonakshi Sinha

కరోనా వైరస్ భయంతో షూటింగులు రద్దు కావడంపైనా సోనాక్షి సిన్హా స్పందిస్తూ..“నా గుండె కు ఇబ్బందికరంగా ఉంది“ అని బాధను వ్యక్తం చేసింది సోనాక్షి సిన్హా.

క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఉన్నాను. కరోనా వైరస్ మహమ్మారి ఇంత పని చేస్తుందనుకోలేదని వాపోయింది.

రోజువారీ వేతన కార్మికులు .. పూట గడవని చిన్న సాంకేతిక నిపుణుల విషయమై ఆందోళనను వ్యక్తం చేసింది. నష్టాలు తగ్గడానికి సన్నివేశం సాధారణ స్థితికి రావాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.

కరోనా వల్ల నేను ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నాను. నా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపాను. నా పెట్ డాగ్ గురించి.. నా పాత అభిరుచుల గురించి తిరిగి గుర్తు చేసుకున్నాను.

సరైన జాగ్రత్తలు తీసుకోవడంపై మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. నేను మారను అనే మనస్తత్వాల్ని మార్చాలి.

ఇది మన గురించి ఆలోచించే సమయం కాదు. మంచి ప్రయోజనం కోసం ఆలోచించాలి.

రోజురోజుకు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటలీకి పరిస్థితులు ఎలా వేగంగా మారాయో చూశాం.

కాబట్టి ఇళ్లలోనే ఉండండి. సురక్షితంగా ఉండండి“ అని సోనాక్షి సందేశం అందించింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం : https://epaper.vaartha.com/