ప్రభాస్‌ను ఓవర్‌టేక్ చేసిన ఐకాన్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ బన్నీ ఐకాన్ స్టార్‌గా మారుతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

దీంతో ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాతో బన్నీ అప్పుడే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఓవర్‌టేక్ చేశాడు. అయితే ప్రభాస్‌ను ఏ విషయంలో బన్నీ ఓవర్‌టేక్ చేశాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ప్రభాస్ నటించిన అన్ని పాన్ ఇండియా చిత్రాలను పుష్ప చిత్రం ఓవర్‌టేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ‘బుక్ మై షో’లో పుష్ప చిత్రానికి ఏకంగా 24.4K లైకులు వచ్చాయి. కాగా ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రానికి 22.9K, సలార్ చిత్రానికి 9.3K, ఆదిపురుష్ చిత్రానికి 9.5K చొప్పున లైక్‌లు వచ్చాయి.

ఈ లెక్కన ప్రభాస్ నటించిన అన్ని పాన్ ఇండియా చిత్రాలను బన్నీ పాన్ ఇండియా చిత్రం పుష్ప అధిగమించడంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.