జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరణ

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఇందుకోసం ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.

అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని డీసీపీ చందన దీప్తి తెలిపారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు ఈనెల 10 వరకు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/