టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలక పరిమాణం

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను సరూర్ నగర్ లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందుకు తీసుకురాగా..నిందితుల అరెస్ట్ ను ఏసీబీ జడ్జ్ తప్పుపట్టారు. సరైన ఆధారాలు లేవని , ముగ్గురి నిందితులను తక్షణమే విడుదల చేయాలనీ జడ్జ్ తీర్పు ఇచ్చారు.

ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ ల అరెస్ట్ విధానాన్ని ఏసీబీ న్యాయమూర్తి తప్పుపట్టారు. న్యాయమూర్తి తీర్పు తో అంత షాక్లో పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయినవారికి ఎలాంటి శిక్ష పడుతుందో అని అంత అనుకుంటున్నా వేళ..వారిని విడుదల చేయాలనీ ఏసీబీ న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం అంత నమ్మలేకపొతున్నారు.

నిన్న బుధువారం హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందని , ఎమ్మెల్యే లతో బేరసారాలు ఆడుతుండగా..పోలీసులు అక్కడికి చేరుకొని వ్యవహారాన్ని భగ్నం చేసిందని , పోలీసులు భారీ ఎత్తున నగదు ను పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు సరైన ఆధారాలు లేవని, నిందితులను వెంటనే విడుదల చేయాలనీ ఆదేశించారు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు ఏమంటారో చూడాలి.