కేటీఆర్ కు ముందే తెలిసే ఆలా ట్వీట్ చేశాడా..?

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను వెంటనే విడుదల చేయాలనీ ఆదేశించారు. సరైన ఆధారాలు లేవని వారిని రిమాండ్‌కు నిరాకరించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ ఈ కేసులో అప్లికేబుల్ కాదని , అభియోగాల్లో పేర్కొన్నట్టుగా ప్రలోభాలు పెట్టేందుకు ఇవ్వజూపిన నగదు, దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో రిమాండ్‌ను న్యాయమూర్తి తోసిపొచ్చారు. ఈ తీర్పు తో అంత షాక్ లో పడ్డారు. కాగా ఇలా జరుగుతుందని ముందే కేటీఆర్ కు తెలుసా..? అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నిన్న ఈ వ్యవహారం బయటకు రాగానే పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నేతలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు , ఆందోళనలు చేయడం , బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి దిష్టి బొమ్మలను దగ్ధం చేసారు. అలాగే ఈ వ్యవహారం ఫై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతారని , ప్రెస్ మీట్ లో కీలక ఆధారాలు బయట పెడతారని అంత అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా దీనిపై టిఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడవద్దని ట్వీట్ చేసారు.

‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసే ముందే నిందితులు విడుదల అవుతారని కేటీఆర్ భావించే ఆలా ట్వీట్ చేసి ఉంటాడని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు.