సిరి హన్మంతుతో శ్రీహన్ బ్రేకప్..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ సభ్యుల జాతకాలను పూర్తిగా మార్చేసింది. అయితే షణ్ముఖ్ , సిరి ల జీవితాలను మాత్రం తలకిందులు చేసింది. హౌస్ లో వీరిద్దరూ ఎంత దగ్గరయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఈ దగ్గరే ఇప్పుడు వారి లవర్స్ నుండి దూరం చేసింది. హౌస్ లోకి వెళ్లకముందే షన్ను దీప్తి తో, సిరి శ్రీహన్ తో ప్రేమాయణం సాగించారు. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నారు. కానీ హౌస్లోకి వెళ్ళాక మాత్రం వీరిద్దరూ దగ్గరయ్యారు.

ఇక హౌస్ నుండి బయటకొచ్చాక వీరి లవర్స్ షాక్ ఇచ్చారు. రీసెంట్ గా షన్నుకు బ్రేక్ చెపుతున్నట్లు పబ్లిక్ గా తెలిపింది దీప్తి. ఇక ఇప్పుడు ఇదే బాటలో శ్రీహన్ కూడా చేరినట్లు తెలుస్తుంది. సిరి కి బ్రేక్ అప్ చెప్పబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీప్తి బ్రేకప్ చెప్పడంతో సిరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసిన విధానం అనుమానాలను కలుగజేసింది. జీవితం చాలా కఠినంగా ఉంటే, నేను దాని కంటే కఠినంగా ఉన్నాను అంటూ చెప్పిన విధానం చూస్తుంటే సిరి కొంత కఠినమైన దశను దాటుతున్నట్లు కనిపిస్తోంది అంటూ పోస్ట్ పెట్టింది.

ఇక శ్రీహన్ సైతం సిరి పిక్స్ ను సోషల్ మీడియా నుండి తొలగించినట్లు తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీహన్ ఆమెతో మాట్లాడటం లేదని, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ రెండు జంటలను విడగొట్టాడని అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు.