ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు!

త్వరలో ఒమిక్రాన్ సునామీ!

Omicron cases
Omicron cases

New Delhi: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా మళ్లి రోజువారి కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత కేసుల్లో కొత్త వేరియంట్ రకం కేసులు కేవలం 2శాతం కంటే తక్కువేనన్న అధికారిక ప్రకటనలు మాటెలావున్నా, వాస్తవ లెక్కలు అధికంగా ఉంటున్నాయి. త్వరలోనే ఒమిక్రాన్‌ సునామీ దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ఓ ఆంగ్ల జాతీయ చానల్‌ తన పరిశోధనలో పేర్కొంది.

దేశంలో అధికారిక ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1500గా అంచనా వేయబడుతోంది. ఇది వాస్తవానికి పది రెట్లు అధికం. దాదాపు 18000 కు చేరుకుని ఉంటుందని అంటున్నారు . కొన్నిదేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం కొత్త వేరియంట్‌ రకంగా ఉన్నాయి. అయితే, డెల్టా కంటే ఒమిక్రాన్‌ తక్కువ తీవ్రత ఇన్ఫెక్షన్ కలిగిస్తున్న విషయమే కాస్తంత ఊరటనిచ్చే విషయంగా ఉంది.

తెలంగాణ వార్తలకోసం: https://www.vaartha.com/telangana/