సింగడు అద్దంకి వెళ్ళాడు… వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర అంటూ జగన్ ఢిల్లీ టూర్ ఫై లోకేష్ సెటైర్లు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం సీకే పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద నుంచి తన 56 రోజును ప్రారంభించారు. పైదిండి వద్ద నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ…జగన్ ఫై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తూ..ప్రభుత్వం ఫై విమర్శలు చేశారు. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటూ వైస్సార్సీపీ మేకపాటి చంద్రశేఖర్ సవాల్ ను తెలిపారు.

ఉదయగిరి వైస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన ఏమాత్రం తగ్గలేదు… రోడ్డు మీద కుర్చీ వేసుకొని దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ జగన్ కే సవాల్ విసిరారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ పనైపోయింది అని చెప్పడానికి” అని అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అలాగే జగన్ ఢిల్లీ ఫై కూడా సెటైర్లు వేశారు.

సింగడు అద్దంకి వెళ్ళాడు… వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర అని ఎద్దేవా చేశారు. జగన్ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. రాజ్యసభ, లోక్ సభలో కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు. కేసుల కోసం తప్ప ప్రత్యేక హోదా గురించి జగన్, ఆయన ఎంపీలు ఏ రోజూ పోరాడలేదు రాష్ట్ర ప్రయోజనాలు నిల్లు. సొంత ప్రయోజనాలు మాత్రం ఫుల్లు అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.

యువగళం దెబ్బకు జగన్ వారానికోసారి ఢిల్లీ యాత్ర చేస్తున్నాడని , జగన్ ది పరదాల యాత్ర… ఈ లోకేష్ ది ప్రజా యాత్ర… ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే నేను ధైర్యంగా కాలర్ ఎగరేసి తిరుగుతున్నాను. తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టే ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా జగన్ హెలీకాప్టర్ వాడుతున్నాడంటూ లోకేష్ భారీ డైలాగ్స్ పేల్చాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు అయ్యా అందరూ విడివిడిగా పోటీచేయ్యండి అని అడుక్కునే పరిస్థితికి జగన్ వచ్చాడని లోకేష్ అన్నారు.

ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు. కానీ రాప్తాడుకి మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీదుర్తి ప్రకాశ్, ఆయన తండ్రి గారు, ఇద్దరు బ్రదర్స్, ఇంకో లేడీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రాప్తాడు వీళ్లకి మంచి పేస్ట్రీ కేకులా దొరికింది. 5 ముక్కలుగా కోసుకొని తినేస్తున్నారు.ఈ నాలుగేళ్లలో వీళ్ల అవినీతి సంపాదన ఎంతో తెలుసా? వెయ్యి కోట్లు. దోపిడీదుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంత మంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకొని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వందల ఎకరాలు దోచేసారు అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.