సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో కేసీఆర్ సర్కార్ ఫై రేవంత్ ఫైర్

సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె ప్రారంభించారు . 72 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న సింగరేణిలో సమ్మెకు పిలునిచ్చారు. కార్మికులందరూ విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోల్ బ్లాక్స్ వేలంతో పాటు తమ 12 డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పలు కార్మికసంఘాలతో పాటు వివిధ పార్టీలు సింగరేణి సమ్మెకు మద్దతు పలికారు.

సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి మద్దతు పలికారు. ట్విట్టర్ ద్వారా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దేశానికి వెలుగులు పంచే సింగరేణిని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. 4 గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తు,కార్మికుల సమ్మెకు మద్ధతిస్తున్నాం అని తెలిపాడు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాల్సిన బాధ్యత కేసీఆర్ సర్కార్ దే అని రేవంత్ అన్నారు.