నేను ట్విట్టర్‌ సీఈవోగా తప్పుకోవాలా? వద్దా?: ఎలాన్‌ మస్క్‌ పోల్‌

సోమవారం ఉదయం వరకు 56% మంది మస్క్ తప్పుకోవడమే మేలని ఓటు

should-i-step-down-from-twitter-ceo-post-asks-elon-musk

న్యూయార్క్‌: ట్విట్టర్ ను తన అధీనంలోకి తీసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ చేసిన మార్పులు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్ లో పోల్ చేపట్టారు. ట్విట్టర్ కొత్త బాస్ గా తాను తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తడంతో తనపైనే ఈ పోల్ నిర్వహించుకుంటున్నారు. ట్విట్టర్ బాస్ స్థానంలో నుంచి తాను తప్పుకోవాలా? వద్దా? అని ట్విట్టర్ యూజర్లను అడిగారు. పోల్ లో వెల్లడైన అభిప్రాయానికి తాను కట్టుబడి ఉంటానని.. సీఈవో పోస్ట్ నుంచి మీరు తప్పుకోమంటే తప్పుకుంటానని మస్క్ ప్రకటించారు. సోమవారం ఉదయం వరకు ఈ పోల్ లో 56 శాతం మంది మస్క్ ను తప్పుకోవాలంటూ ఓటేయగా.. మిగతా 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/