కోరిక

శ్రీ షిర్డీసాయి లీలలు

Shirdi Sai
Shirdi Sai

సాయిబాబాను గురువుగా సేవించినవారు కొందరు, సాక్షాత్తు దైవస్వరూ పునిగా భావించి పూజించినవారు మరి కొందరు. సాయిబాబాను దర్శించిన వారుమరికొందరు.

ఏ విధంగా తనను ఆరాధించినా, సేవించినా, వారివారి కోరికలను తీర్చేవాడు సాయిబాబా. వివిధ సందర్భాలలో సాయిబాబా వంటి మహానీయులు భక్తుల కోర్కెలను తీరుస్తారు. భక్తులకోరికలలో వైవిధ్యం కనిపిస్తుంది. శ్రీపాదశ్రీవల్లభుడు కురువపురంలో ఉండేవాడు. ఒక చాకలివాడు భక్తి శ్రద్ధలతో ఆయనను దర్శించేవారు, ఆయన బట్టలను ఉతికి, ఆరవేసి, వాటిని ఆశ్రమమున ఉంచెడివాడు. ఇట్లా చాలాకాలం గడిచింది.

శ్రీపాద శ్రీవల్లభుడు ఆతని సేవలకు ప్రసన్నుడయి వరము కోరు కొమ్మన్నాడు. ‘నాది పేద రికపు బతుకగుటచే కోరికలు కొనసాగక నశించినవి నా వయసు మళ్లినది.

ఈ ముసలి తనమున నన్నుమీ ఆశ్రమ ము వద్ద ఉండనిచ్చి, అది చాలు అన్నాడు రజకుడు శ్రీపాద శ్రీవల్లభునితో. ఒకనాడు కృష్ణానదియందు ఓడలో ఒక నవాబు ప్రయాణం చేయుచున్న దృశ్యమును రజకుడు చూచాడు. రాణులు, మంది మార్బలం, పగటీ దీపములు, ఇంకా ఎన్నో చూచాడు. ఆలోచనలో పడ్డాడు రజకుడు. అదే సమయాన శ్రీపాద శ్రీవల్లభులు రావటం, రజకుని చూడడం జరిగింది. రజకుని ‘ఏమి ఆలోచించు చున్నావు? ‘ అని ప్రశ్నించారు శ్రీపాదశ్రీవల్లభులు.

‘మహాత్మా! ప్రభువైజన్మించుటకు వెనకటి జన్మపుణ్యమైన ఉండవలయును లేదా మీ బోటి జగద్గురువులను సేవించ వలెగదా! అని ఆలోచి స్తున్నానన్నాడు రజకుడు . ‘ నీవు ముందు జన్మమున తురకల కులముననందేపుట్టి రాజ్యపాలన చేయుదువు అన్నారు శ్రీపాదులు. ‘ ఆ జన్మమందు మీ పాద పద్మములసేవించు భాగ్యము ఎటుల లభించును? ప్రశ్నించాడు రజకుడు.

మరుజన్మమున నేను నరసింహ సరస్వతిగ సన్యాసియై యుందును. ఆ జన్మమునందు నన్ను నీవు గుర్తించునటుల పూర్వజన్మస్మృతి ఇచ్చెదను అన్నారు శ్రీపాదులు. రజకుడు మరల సంతోషంతో శ్రీపాదులకు నమస్కరించడు. రజకుడు మరణించాడు.

వైడూర్య నగరమును పాలించు ప్రభువుకు కుమారునిగా జన్మంచి, రాజ్యమేలాడు. అంతిమ మున నరసింహసరస్వతుల దర్శనమయింది. పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి వచ్చి, తన గురుపార్ధారములపై పడ్డాడు ఆనందంతో. కొందరు లౌకిక కోరికలు కోరవచ్చును. రామానుజాచార్యులవారు కొన్ని నెలలపాటు తిరుమల తిరుపతిలో ఉన్నారు. ఆ సమయములో ఒక గొల్ల వనిత రామానుజు లకు పాలు పెరుగు ఇచ్చేది. ఒక నెలగడిచినది.

డబ్బు ఇస్తానని రామానుజులు పలికారు. ఆమె అంగీక రించ లేదు. ఇక కొన్ని నెలల తర్వాత రామాను జులు శ్రీరంగం పోదామ నుకున్నారు. అప్పుడు ఆ విషయాన్ని గొల్ల వనితకు చెప్పి డబ్బు తీసుకో అన్నారు. అప్పుడు కూడా ఆమె అగీకరించలేదు.

‘ఏమమ్మా! డబ్బులు తీసు కోవా? ప్రశ్నించారు రామానుజులు. ‘ అయ్యా! మీరెవరో తరగని సంపద ఇస్తారటగా. అది నాకు ఇప్పించండిచాలు అన్నదామె. ‘అది ఏమిటి? మరల రామానుజులు ప్రశ్నించారు.

‘ నాకు మొక్ష మిమ్మని వేంకటేశ్వరస్వామికి చిన్న చీటివ్రాసి ఇవ్వండి అది చాలు అన్నది ఆమె. ఆమె కోరికకు ఆశ్చర్యపోయారు రామనాఉజులు. ఆమెకు తనపైన, వేంకటేశ్వరులపైన ఎంత నమ్మకం! వెంటనే చీటివ్రాసి ఇచ్చారామెకు. ఆమె సంతోషంతో రామను జులకు నమస్కరించింది.

ఆ చీటిని వేంకటేశ్వరుని సన్నిధిలో సమర్పించింది. మరుక్షణం ఆమె శరీరం నుండి జీవుడు పరమపదానికి వెళ్లిపోయాడు!

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/specials/career/