శ్రీవారి దర్శన టోకెన్ల విడుదల

తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్‌ కోటాకు సంబంధించిన టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లను ఆదివారం విడుదల చేస్తున్నది. కోవిడ్ నేపథ్యంలో టీటీడీ ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్‌లైన్ ద్వారానే విడుదల చేస్తున్నది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం కోసం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/