వైద్యులకు శిరసా నమామి…చంద్రబాబు

ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన సేవ చేస్తున్నారు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్‌లో స్పందించారు. వైద్యులకు, నర్సులకు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తాండవిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిలసిన కూడా మన ప్రాణాలు కాపాడడానికి వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు శిరసా నమామి అంటూ వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని , ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నియమాలను పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటు మన ప్రాణాలు కాపాడుకోవడమే కాక,మన కుటుంబం, మన సమాజం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం అంటూ పేర్కోన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/