కరోనా అనంతర పరిణామాలపై చర్చ!

యూఏఈ ప్రధాని కరోనా అనంతర పరిణామాలపైప్రభుత్వ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం

Sheikh Mohammed bin Rashid
Sheikh Mohammed bin Rashid

యూఏఈ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచం అంతా నిర్భందంలోకి వెళ్లిపోయింది. తాజాగా కొన్ని దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా తర్వాత తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. కరోనా కారణంగా ఏర్పడ్డ సమస్యల నుంచి యూఏఈ సాధ్యమైనంత త్వరగా బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కావాడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. కాగా..


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/