కరోనా ఎఫెక్ట్: మహారాష్ట్రలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.50

రద్దీ తగ్గించే పనిలో రైల్వేశాఖ కీలక నిర్ణయం

Railway Platform

Mumbai: కరోనా కారణంగా మహారాష్ట్రలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.50కి పెరిగిపోయింది. 

దేశంలో కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ ఇప్పటి వరకూ 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గించే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచేసింది.

ఈ మేరకు  సెంట్రల్ రైల్వే మంగళవారం ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ అధికారి పేర్కోన్నారు.

ఇదే విధంగా ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగించాలని నిర్ణయించింది.

తాజా సినిమా వార్తల కోసం :https://www.vaartha.com/news/movies/