టిక్‌టాక్‌ పై ట్రంప్‌ డెట్‌ లైన్‌

టిక్‌టాక్‌ పై ట్రంప్‌ డెట్‌ లైన్‌
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ టిక్‌టాక్‌ నిషేధం గడువుపై డెట్‌ లైన్సె జారీ చేశారు. సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్‌టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు. తాజా పరిణామంపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్‌టాక్ స్పందించాల్సి ఉంది. కాగా గత నెలలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా విధించిన సంగతి తెలిసిందే.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/