కాలిఫోరియాలో కొనసాగుతున్న కార్చిచ్చు

కాలిఫోరియాలో కొనసాగుతున్న కార్చిచ్చు
wildfires across California

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోరియాలో చెలరేగిన కార్చిచ్చు మంటల ఉద్థృతి ఇంకా కొనసాగుతుంది. అమెరికాలోని మూడు వెస్ట్‌ కోస్ట్ రాష్ట్రాలలో ఈ మంటలు వ్యాపించాయి. ఇప్పటి వరకు 24 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఒరెగానేలో ఐదు లక్షల మందిని ఆ ప్రాంతం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. ఒరెగానేలో చిన్నగా మంటలు చెలరేగాయని, రాష్ట్ర అత్యవసర నిర్వహణ అధికారులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక మెలిల్లా నగరం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో అక్కడ ఉంటున్న 9000 మందిని ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వీరిలో అందరూ నగరాన్ని విడిచి వెళ్లడానికి అంగీకరించినా కేవలం 30 మంది మాత్రమే తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించలేదు. వర్షం మాత్రమే ఈ మంటలు ఆగటానికి సహకరించగలదని, గాలి వేగం తగ్గడం, తేమశాతం పెరిగితే ఫైర్‌ ఫైటర్స్‌కు కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/